ఆంటీ అంటావా.. ? అంటూ హీరోయిన్ బండ బూతులు !
బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ చేసిన పిచ్చి పనికి నెటిజన్స్ ఏ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ‘సన్ అఫ్ అభిష్’ అనే చాట్ షో లో పాల్గొన్న స్వరా భాస్కర్.. కెరీర్ ఆరంభ విషయాలను గుర్తుచేసుకుంటూ.. అప్పట్లో చేసిన ఓ ప్రకటన గురించి చెప్పుకొచ్చారు. ఆ యాడ్ లో తనతో కలిసి నటించిన ఓ 4 ఏళ్ళ కుర్రాడు తనని ఆంటీ అన్నాడంటూ.. ఏ సిగ్గు శరం లేకుండా చిన్న పిలాడు అని కూడా ఆలోచించకుండా నానా బూతులు తిట్టింది. దీంతో ఆమెని నెటిజన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఏమి తెలియని 4 ఏళ్ళ పిల్లాడిని ఇంగిత జ్ఞానం లేకుండా తిడతావా అంటూ నెటిజన్ల ఆమె పై మండిపడుతున్నారు.
లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అనే సంస్థ.. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్ కి పిర్యాదు చేసి ఆమెపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘వీరే దీ వెడ్డింగ్’ సినిమాలోని ఆ ఒక్క సీన్.. స్వరా భాస్కర్ ఫేట్నే మార్చేసింది. కరీనా కపూర్, సోనమ్ కపూర్ లాంటి స్టార్స్ నటించిన వీరే దీ వెడ్డింగ్ సినిమాలో భర్తకు దూరంగా ఉన్న భార్య.. స్వయం సంతృప్తి పొందే సన్నివేశం అప్పట్లో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. ఆ క్యారెక్టర్లో నటించిన స్వర భాస్కర్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.