రైతుల కోసం శ్రీరెడ్డి ర్యాప్ వాక్ !
వివాదాస్పద నటిగా పేరొందిన శ్రీరెడ్డి గొప్ప పని చేసింది. రైతుల కోసం ర్యాప్ వాక్ చేసింది. శ్రీరెడ్డి ప్రవోలియన్ ఫ్యాషన్ షోలో తళుక్కున మెరిసింది. ప్రవోలియన్ సంస్థ రైతుల ఆదుకోవడం కోసం షో నిర్వహిస్తోంది. ఈ ఫ్యాషన్ షో ద్వారా వచ్చిన ఆదాయాన్ని రైతుల సంక్షేయం కోసం ఖర్చు చేస్తుంది. ఈ షోలో శ్రీరెడ్డి పసుపు పచ్చ రంగు గౌన్ లో తన అందాల విందు పంచింది. క్లీవేజ్ షో కి హద్దు లేకుండా పోయింది. నిండైన అందాలతో అలరించింది.
టాలీవుడ్, కోలీవుడ్ లోనూ కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి పోరాటం చేసింది. చేస్తోంది కూడా. అప్పట్లో ఫిలిం ఛాంబర్ దగ్గర అర్ధనగ్నంగా కూర్చొని నిరసనలు వ్యక్తం చేసింది. సెలేబ్రిటిల ఫోటోలను బయటపెడుతూ.. భయభ్రాంతులను చేసింది. ఇప్పటికీ శ్రీరెడ్ది నోరు తెరిచింది అంటే.. హడలే. బోల్డ్ కనిపించడం మాత్రమే కాదు.. బోల్డ్ గా మాట్లాడటం ఆమెకి అలవాటు. ఐతే, ఈసారి శ్రీరెడ్డి బోల్డ్ గా కనిపించినా.. అది రైతులకి సాయం చేసేందుకని తెలుసుకొని పలువురు ఆమెని అభినందిస్తున్నారు.