వైరల్ : ‘కమ్మరాజ్యంలో పిల్ల రెడ్లు’.. వీడియో చూశారా ?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రిలీజ్ డేటు ఫిక్స్ కాలేదు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని తనదైన శైలిలో నిర్వహిస్తున్నారు వర్మ. ఇటీవలే ట్రైలర్ ని వదిలారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకొన్న పరిణామల నేపథ్యంలో ఈ సినిమా తెరక్కెక్కినట్టు ట్రైలర్ ని చూస్తే అర్థమైంది. అంతేకాదు.. కేఏ పాల్ పై ఓ ప్రత్యేక పాటని విడుదచేసి ఫుల్లుగా నవ్వించేశాడు.

ఇప్పుడీ సినిమా జనాల్లోకి వెళ్లింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ పై ‘కమ్మరాజ్యం పిల్ల రెడ్లు’ అంటూ ఓ సూప్ వీడియో బయటికొచ్చింది. వైరల్ అయింది. ఈ వీడియోని వర్మ కూడా రీ ట్విట్ చేశారు. వెనకాల టీవీలో కమ్మరాజ్యంలో కడపరెడ్లు టైటిల్ సాంగ్ వస్తుండంగా ఇద్దరు పిల్లలు బనియన్స్ ధరించి మీసాలు తిప్పితూ.. తొడకొట్టడం ఆకట్టుకుంటోంది. కమ్మరాజ్యంలో పిల్ల రెడ్లు వీడియోని మీరు ఓ సారి చూసేయండీ.. !