అనిల్’తో మహేష్ మరో సినిమా !
ఇక్కడ అనిల్ అంటే దర్శకుడు అనిల్ రావిపూడి కాదు. నిర్మాత అనిల్ సుంకర్. ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మిస్తున్న సంస్థల్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. ఇప్పుడు ‘ఏకే’లో మహేష్ మరో సినిమా చేయడానికి రెడీ అయినట్టు సమాచారమ్. సరిలేరు తర్వాత వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్ మరో సినిమా చేయాల్సి ఉంది. ఐతే, అంతకంటే ముందే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మహేష్ సినిమా ఉండనుందట. ఇటీవలే లైన్ చెప్పిన ప్రశాంత్ నీల్.. త్వరలోనే మరోసారి నేరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.
ఫైనల్ స్క్రిప్ట్ ఓకే అయితే.. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలోనూ మహేష్ నిర్మాణ భాగస్వామిగా ఉంటాడట. మరీ.. వంశీపైడిపల్లి పరిస్థితి ఏంటీ ? అంటే.. ఆయనకి వెయిట్ చేయడం అలవాటే. తనదైన శైలిలో కథకి మెరుగుతు దిద్దితూ ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయ్యే వరకు మహేష్ కోసం వంశీ వెయిట్ చేయాల్సిందేనని చెబుతున్నారు. అన్నట్టు.. మహేష్ తర్వాత తారక్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉండనుంది.
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహెష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర-దిల్ రాజు-మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేదాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సరిలేరు ప్రేక్షకుల ముందుకు రానుంది.