చరణ్’తో పవన్ సినిమా.. ఇది ఫిక్స్ ! 

అభిమానులకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీపి కబురు చెప్పిన సంగతి తెలిసిందే. ‘పింక్’ తెలుగు రిమేక్ తో రీఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. పింక్ రిమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాని పవన్ పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో పవన్ వరుస సినిమా చేస్తాడని అర్థమవుతోంది.

వాస్తవానికి పవన్ సినిమాల్లో నటించడం కంటే సినిమాలు నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నాడట. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌ని ఆయ‌న మ‌ళ్లీ ట్రాక్‌మీద‌కు తెచ్చే ఆలోచ‌న‌లో ఉన్నారు. అందుకు సంబంధించిన ప్ర‌య‌త్నాలూ సాగుతున్నాయి. తొలుత త‌న కుటుంబం లోని ఓ హీరోతోనే సినిమా చేయాల‌ని భావిస్తున్నారు. ఆ హీరో ఎవ‌రో కాదు… రామ్ చ‌ర‌ణ్‌. ప‌వ‌న్‌ రామ్ చ‌ర‌ణ్‌తో ఓసినిమా చేసే అవ‌కాశాలు
పుష్క‌లంగా ఉన్నాయి. ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ బిజీగా ఉన్నారు. దీంతో పవన్-చరణ్ సినిమాకి కాస్త టైమ్ పట్టేలా ఉంది. దీనిపై ఇటీవల ‘నా సంస్థ‌లో బాబాయ్ చేస్తే ఆనంద‌మే. బాబాయ్ నిర్మాత‌గా నేను సినిమా చేసినా ఆనంద‌మే’ అంటూ ఓ హింట్ చరణ్.