ఈ ముగ్గురి పరిస్థితి ఒక్కటే !
ప్లాపుల్లో ఉన్న హీరోలు ఫ్రీ బోర్డ్ పెట్టేస్తున్నారు. రెమ్యూనరేషన్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ప్లాపుల్లో ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ నెల జీతానికి పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రం ‘ఇద్దరిదీ ఒక్కటే లోకం’. విక్రమ్ కుమార్ కొండా దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రాజ్ తరుణ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. నెల జీతం మాత్రమే తీసుకొంటున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ ఒక్కరే కాదు.. రవితేజ, గోపీచంద్ లది ఇలాంటి పరిస్థితే.
మాస్ మహారాజా రవితేజ ప్లాపుల్లో ఉన్నాడు. రాజా ది గ్రేట్ తర్వాత ఆయన చేసిన టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్భర్ ఆంథోని సినిమాలు ప్లాప్ అయ్యాయి. అందుకే రవితేజ కూడా దిగొచ్చాడు. తన కొత్త సినిమా కోసం పారితోషికం తీసుకోవడం లేదు. రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్ కథానాయిక. ఈ సినిమా కోసం రవితేజ పారితోషికం తీసుకోలేదు. లాభాల్లో వాటా తీసుకునే షరతు మీదే సినిమా పట్టాలెక్కింది. గోపీచంద్ కూడా పరిస్థితి ఇంతే. సంపత్ నంది సినిమా కోసం గోపీచంద్ పారితోషికం తీసుకోవడం లేదు. లాభాల్లో వాటా తీసుకోబోతున్నారట.