‘నిశ్శబ్ధం’ సస్పెన్స్ అదిరింది !

స్వీటీ అనుష్క తాజా చిత్రం ‘నిశ్శబ్ధం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన సెలబ్రెటీ మ్యూజిషియన్ గా అంథోని అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అంజలి, హాలీవుడ్ యాక్టర్ మైకేల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు వర్షన్ టీజర్ దర్శకుడు పూరి జగన్నాథ్ చేతుల మీదుగా విడులైంది.

‘నిశ్శబ్ధం’ స్టోరీ లైన్ గురించి పక్కనపెడితే.. టీజర్ లో సస్పెన్స్ అదిరింది. మూగ అమ్మాయి, చిత్రకారిణి పాత్రలో స్వీటీ అనుష్క ఒదిగిపోయింది. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. చాలా కథలని కాదని స్వీటీ ఈ సినిమాని ఎందుకు ఎంచుకొన్నారు ? అన్నది టీజర్ తో సమాధానం దొరికినట్టయింది. ఇదో రివెంజ్ స్టోరీ. దాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ గా అద్భుతంగా తెరకెక్కించినట్టు టీజర్ తో అర్థమవుతోంది. నిశ్శబ్ధం టీజర్ ని మీరు ఓ సారి చూసేయండీ.. !