త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్ : ఆయన పంచ్ డైలాగ్స్ కొన్ని.. మీ కోసం !
లాగదీయడం, సాగదీయడం ఆయనకి నచ్చదు. వదిలితే బుల్లెట్ లా గుండెల్లోకి దిగిపోవాలె అంతే. అతడే మాటల మాంత్రికుడు.. త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన మాటలో కాస్త చిలిపిదనం.. కాస్త వెటకారం.. ఇంకాస్త గాంభీర్యం కనిస్తుంటుంది. అన్నింటికీ మించి ఆత్మీయమైన మాటలతో ఆలోపింజేస్తుంది. నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా గురూజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.
త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన పేల్చిన పంచ్ డైలాగ్స్ పై ఓ లుక్కేద్దాం పదండీ :
* మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్లు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టే వాళ్లు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు – నువ్వునాకు నచ్చావ్
* వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయినట్లు.. ఫెయిల్ అయిన ప్రేమికులందరూ ఫ్రెండ్స్ అయిపోరు – చిరునవ్వుతో..
* మనం తప్పు చేస్తున్నామో.. రైట్ చేస్తున్నామో మనకు తెలుస్తుంది.. మన ఒక్కళ్లకే తెలుస్తుంది- నువ్వే నువ్వే* నిజం చెప్పకపోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం- అతడు
* అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు- ఖలేజా
* తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది. వెళ్లిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది – అత్తారింటింకి దారేది
* పని చేసి జీతం అడగొచ్చు. అప్పు ఇచ్చి వడ్డీ అడగొచ్చు. కానీ హెల్ప్ చేసి మాత్రం థ్యాంక్స్ అడగకూడదు – మల్లీశ్వరి
* బాధలో ఉన్నవాడిని ఎలా ఉన్నావ్ అని అడగడం అమాయకత్వం. బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగటం అనవసరం- నువ్వునాకు నచ్చావ్
* కారణం లేని కోపం, ఇష్టం లేని గౌరవం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం- తీన్‌మార్
* బెదిరింపునకు భాష అవసరం లేదప్ప అర్థమైపోతుంది- జల్సా
* మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి. కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు – సన్నాఫ్ సత్యమూర్తి
* రావణాసురిడి మమ్మీ డాడీ కూడా సూర్పణకని సమంత అనే అనుకుంటారు కదే..”నువ్వు కత్తి నాన్న’ ”రావణాసురుడి వాళ్లవిడా కూడా వాళ్లయనను పవన్‌కల్యాణ్ అనే అనుకుంటుంది” ఇది అమ్మోరు కత్తినాన్నోయ్ – అ ఆ
* ఇది మనం కూర్చొనే కుర్చీ.. పచ్చని చెట్టును గొడ్డలితో పడగొట్టి.. రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి.. బెరడును బ్లేడ్‌తో సానబెట్టి.. ఒళ్లంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు. ఎంత హింస దాగి ఉందో కదా! జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఒక మినీ యుద్ధమే ఉంటుంది- అజ్ఞాతవాసి
* ”వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు. వాడు గొప్పవాడు”- అరవింద సమేత
* కంట పడ్డావా కనికరిస్తానేమో.. ఎంట పడ్డానా.. నరికేస్తా ఓబా.. – అరవింద సమేత
* మండు వేసంగి గొంతులో దిగిత ఎట్టా ఉంటాదో తెలుసా.. మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టా ఉంటాదో తెలుసా.. మట్టి తుపాను చెవిలో మోగితే ఎట్టా ఉంటాదో తెలుసా – అరవింద సమేత
* ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు ట్రెండ్ అంటారు.. వ్యాపార వేత్తలు ప్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ, ప్రతి జనరేషన్‌లో ఆ కొత్త థాట్‌ను ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడినే టార్చర్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూశావా బాలిరెడ్డి.. వాడే టార్చ్ బేరర్..- అరవింద సమేత