రాశీఖన్నా తొలిసారి ఆ పని చేస్తోంది.. !


అందం ఎరగా వేసి.. ఆ తర్వాత తనలోని అసలు సిసలు టాలెంట్ ని బయటపెట్టిన ముద్దుగుమ్మ రాశీఖన్నా. కెరీర్ స్టార్టింగ్ లో గ్లామర్ పాత్రలే ఎక్కువ చేసింది. గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొంది. ఐతే, తొలిప్రేమతో రాశీ మంచి నటి అనిపించుకొంది. ఇప్పుడు అటు గ్లామర్, ఇటు నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం వెంకీమామ, ప్రతిరోజూ పండగే, వరల్డ్ ఫేమస్ లవ్వర్ సినిమాలతో బిజీగా ఉంది రాశీ. లవర్ సినిమా కోసం ఆమె మునుపెన్నడు లేని పని చేసిందట. 

ఇన్నాళ్లు రాశీఖన్నా తన గొంతుకు అరువు తెచ్చుకొనేది. తన పాత్రకి వేరేవారు డబ్బింగ్ చెప్పేవారు. తొలిసారి ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పానని సంతోషంగా చెబుతోంది. ఆనందంలో ‘తొలిసారిగా నేను డబ్బింగ్ చెప్పబొతున్నా. నేనే ఆశ్చర్యపోతున్నా. మీరందరూ నా వాయిస్ వినేవరకు ఎదు రుచూడలేకపోతున్నా’ అంటూ ట్విట్ చేసింది రాశీ. 

ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. కెఎస్ రామారావు సమర్పణలో ఈ చిత్రాన్ని కెఎ వల్లభ నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. వచ్చే యేడాది ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్. 
  ర్పిస్తున్నారు.