త్రివిక్రమ్ చూపించింది ట్రైలర్ మాత్రమే.. !

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ టాలెంట్ గురించి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ.. భవిష్యత్ లో తీయబోయే సినిమాలకు ట్రైలర్స్ లాంటివి అంటున్నాడు ఆయన స్నేహితుడు, రచయిత అబ్బూరి రవి. వీరిద్దరు క్లాస్ మేట్స్. త్రివిక్రమ్’ని తెలుగు పరిశ్రమకు తీసుకొచ్చింది ఈయనే.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అబ్బూరి రవి త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ.. “త్రివిక్రమ్ లోని రైటర్ .. డైరెక్టర్ ఇద్దరూ గొప్పవాళ్లే. ఇప్పుడు తాను చేస్తోన్న సినిమాలకి దాదాపు 100 శాతం బెటర్ గా ఆయన సినిమాలు చేయగలడు. ఇప్పుడు ఆయన చేస్తోన్న సినిమాలన్నీ త్వరలో ఆయన చేయనున్న సినిమాలకు ట్రైలర్స్ లాంటివనేది నా అభిప్రాయ పడ్డాడు” స్నేహితుడు చెప్పినట్టు త్రివిక్రమ్ పూర్తి టాలెంట్ ని చూపించాలని కోరుకొంద్దాం.