కోహ్లీ కంటే వేగంగా మంధాన.. 2వేల రికార్డ్ !


వన్డేల్లో వేగవంతంగా 2 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో మహిళా క్రికెటర్ గా టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన రికార్డ్ సృషించింది. విండీస్ తో బుధవారం జరిగిన నిర్ణయాత్మక వన్డేలో స్మృతి మంధాన (74; 63బంతుల్లో) అర్ధశతకంతో ఆకట్టుకుంది.
దీంతో ఆమె వన్డేల్లో వేగవంతంగా (51 ఇన్నింగ్స్ లో) 2 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో మహిళా క్రికెటర్ గా నిలిచింది. ఆమె కంటే ముందు ఆసీస్ మాజీ క్రికెటర్  బెలిండా క్లార్క్, ప్రస్తుత కెప్టెన్ మెగ్ లానింగ్ 45 ఇన్నింగ్స్  ల్లో ఈ ఘనతను సాధించారు.

పురుషుల క్రికెట్ లో దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్ మన్ హషీమ్ ఆమ్లా 40 ఇన్నింగ్స్ లో 2వేల క్లబ్ లో చేరిపోయాడు. ఇక భారత్  తరఫున శిఖర్ ధావన్ (48), విరాట్ కోహ్లీ (53), గంగూలీ (52), ఈ రికార్డును చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంధాన ధావన్ మినహా అందరినీ వెనక్కి నెట్టింది. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే వేగంగా 2వేల పరుగులని సాధించింది. ఆమె పరుగుల వేట ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.