జేసీకి వైసీపీ బిగ్ ఆఫర్ !
తెదేపా నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోరు తెరిస్తే సంచలనమే. ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కక్షసాధింపులో భాగంగానే తనకు చెందిన ట్రావెల్ బస్సులను సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. ట్రైబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చినా 15 బస్సులను ఆర్టీఏ అధికారుల ఆధీనంలోనే ఉంచుకున్నారన్నారు. పర్మిట్ లేని ఒక్క బస్సునైనా చూపిస్తారా అని జేసీ సవాల్ విసిరారు. అంతేకాదు.. ఒకట్రెండు రోజుల్లోనే తన మైనింగ్ మూసివేతకు కూడా ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారని జేసీ వ్యాఖ్యానించారు.
ఓ వైపు వైకాపా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూనే.. ఆ పార్టీ నుంచి తనకి ఆహ్వానం వచ్చిందని జేసీ చెప్పడం విశేషం. వైకాపాలోకి రావాలని ఓ పెద్ద మనిషి తనను ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. అందుకోసం జేసీకి పెద్ద ఆఫరే చేశారట. ఆ ఆఫర్ ఏంటన్నది మాత్రం జేసీ బయటపెట్టలేదు. వైసీపీ ఆఫర్ ని ఉద్దేశించి.. రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ఇంతకముందే చెప్పానని గుర్తుచేశారు.