ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే పైకొస్తాం : కేటీఆర్
ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే పైకొస్తాం అన్నారు మంత్రి కేటీఆర్. గురువారం హైదరాబాద్‌లో సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్… గిరిజన బిడ్డలను వ్యాపారవేత్తలుగా తీర్చదిద్దడం గొప్ప విషయం అన్నారు. పారిశ్రామిక శాఖ ఆధ్వర్యంలో పారిశ్రామిక పార్క్‌లో గిరిజనులకు అవకాశం కల్పిస్తాం. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తల కోసం బ్యాంకులతో సమావేశమవుతామన్నారు.
ప్రతి పారిశ్రామిక పార్కులో రిజర్వేషన్లు ఉన్నాయని.. మహిళా ప్రత్యేక పారిశ్రామిక పార్కులను, పారిశ్రామిక హెల్త్ క్లినిక్‌ను ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించేవి చిన్న, మధ్యతరహా సంస్థలే. పెద్ద పరిశ్రమలు ఉండాలని, అదే సమయంలో చిన్న పరిశ్రమలు కావాలన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటుగా సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు.