అల.. మలయాళ టైటిల్ ‘అంగు వైకుంఠ‌పుర‌త్తు’ !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కి మలయాళంలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన ప్రతి సినిమా అక్కడ రిలీజ్ అవుతుంటుంది. మంచి కలెక్షన్స్ రాబడుతుంటాయ్. బన్నీ ప్లాప్ సినిమాలు కూడా మలయాళంలో మంచి కలెక్షన్స్ సాధించడం చూశాం. అక్కడ బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకొంటారు. బన్నీ తాజా చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ కూడా మలయాళంలో రిలీజ్ కానుంది. తాజాగా అల.. మలయాళ పోస్టర్ ని విడుదల చేశారు.

మలయాళంలో ఈ చిత్రానికి ‘అంగు వైకుంఠ‌పుర‌త్తు’ అనే టైటిల్‌ పెట్టారు. ఇక బ‌న్నీ ప‌రిగెత్తుతున్న‌ట్టుగా ఉన్న స్టిల్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు. తెలుగులో విడుదలై రికార్డులు సృష్టిస్తున్న అల.. ఫస్ట్ సాంగ్ ‘సామజవరగమన’ని ఈ నెల 10న మలయాళంలో విడుదల చేయబోతున్నారు. ఈ పాట‌తో మ‌ల‌యాళంలోను సినిమాపై హైప్ క్రియేట్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. తివిక్రమ్-అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతోన్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.