రకుల్ పెద్ద క్రిమినల్ 

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి లెటెస్ట్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. ఆమె పెద్ద క్రిమినల్ లాయరట. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ‘చదరంగం’ టైటిల్ ప్రచారంలో ఉంది. టైటిల్ కి తగ్గట్టుగా సినిమాలో అనూహ్యమైన మలుపులు ఉంటాయట. సినిమాలో నితిన్ పాత్ర ఏంటన్నది తెలియరాలేదు. కానీ, రకుల్ పాత్ర ఏంటన్నది లీకైంది. సినిమాలో ఆమె క్రిమినల్ లాయర్ గా కనిపించబోతున్నట్టు సమాచారమ్.

ఇక తెలుగులో రకుల్ మునుపటిలా బిజీగా లేదు. బాలీవుడ్‌లో అయ్యారి, ది దె ప్యార్‌ దె వంటి చిత్రాలలో నటించింది. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘మార్జావన్‌’ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రొమాంటిక్‌, యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు అర్జున్‌కపూర్‌ కథానాయకుడిగా కాశ్వీనాయర్‌ దర్శకత్వంలో రూపొందే బాలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం రకుల్‌ను వెతుక్కుంటూ వచ్చింది. ప్రస్తుతం రకుల్ ఇండియన్‌ 2, నితిన్,  శివకార్తికేయన్‌ సినిమాలతో బిజీగా ఉంది.