‘వెంకీమామ’ టైటిల్ సాంగ్.. దిష్టి తీయాల్సిందే.. !!

విక్టరీ వెంకటేష్ ఆయన మేనల్లుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా కథానాయికలు. బాబీ దర్శకుడు. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు. ‘మచ్చెరగని మేనమామ మేలుజాతి రత్నం.. ఆ మామకు అల్లుడంటే అంతులేని ప్రాణం.. ఇరుగుదిష్టి, పొరుగు దిష్టి తీయవమ్మ సిరి గోదావరి… ‘ అంటూ సాగే సాంగ్ అదిరిపోయింది. గోదావరి అందాల మధ్య మామ-అల్లుళ్ల అనుబంధాన్ని వివరిస్తున్న ఈ సాంగ్ కి నిజంగానే దిష్టి తీయాల్సిందే.

ముఖ్యంగా సంగీత సంగీత దర్శకుడు థమన్ కి దిష్టి తీసుకోవాల్సింది. ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాకి అద్భుతమైన పాటలిచారు థమన్. ఇప్పుడు వెంకీమామ టైటిల్ పాట ఆ రేంజ్ లోనే ఉంది. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. శ్రీకృష్ణ, మోహన్ భోగరాజు కలిసి పాడారు. థమన్ సంగీతం అందించారు. వెంకీ టైటిల్ సాంగ్ ని మీరు ఓ సారి వినేయండీ.. !