రోహిత్ సిక్సర్ల రికార్డ్
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి సిక్సర్ల రికార్డుని సృష్టించాడు. మూడో ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. రెండో టీ20లో బంగ్లాదేశ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి ఛేదించింది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది.రోహిత్ శర్మ (85; 43 బంతుల్లో 6×4,6×6) రెచ్చిపోయి ఆడాడు. భారీ బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. శిఖర్ ధావన్ (31; 27 బంతుల్లో 4×4), శ్రేయస్ అయ్యర్ (24*; 13 బంతుల్లో 3×4, 1×6) మెరిశారు.
ఈ మ్యాచ్ రోహిత్ శర్మకి వందో టీ20. టీ20ల్లో నాలుగో సారి శిఖర్ ధావన్‌తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యం అందించాడు. అంతేకాదు.. వరుసగా మూడో ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. గత రెండేళ్లుగా టీ20ల్లో అత్యధిక సిక్సర్స్ బాదిన ఆటగాడిగా రోహిట్ టాప్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ యేడాది రోహిత్ పేరు మీదనే సిక్సర్ల రికార్డ్ నమోదు కానుంది.