అయోధ్య తీర్పు : రాష్ట్రాలకి కేంద్రం అలర్ట్

దశాబ్ధాలుగా కొనసాగుతున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం అంశంపై దేశ అత్యన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు తుది తీర్పుని వెలువరించనుంది. సీజేఐ రంజన్‌ గొగొయి పదవీకాలం ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఆ లోపే అయోధ్య తీర్పు సుప్రీం కోర్టు వెలువరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.

 ముఖ్యంగా సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హోం మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేసింది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు 4వేల మంది పారామిలిటరీ దళాలను తరలించినట్లు హోంశాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. హైదారాబాద్ లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నారు.