షార్ట్ ఫిల్మ్స్’లో ఛాన్స్ అంటూ గాలం.. చేయించేది వ్యభిచారం !
సినిమా ఆఫర్ల పేరిట మోసాలు తరచూ వెలుగులోకి వస్తుండటం చూస్తున్నాం. సినిమా ఆఫర్స్ ఇప్పిస్తామంటూ డబ్బులు గుంజడం, లైగింక కోరికలు తీర్చుకోవడం వంటివి చాలానే వెలుగులోనికి వచ్చాయ్. తాజాగా, షార్ట్ ఫిల్స్మ్, సినిమా ఆఫర్ల పేరిట ఆకర్షి, బ్లాక్ మెయిల్ చేసి.. వ్యభిచారం చేయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నెల్లూరుకి చెందిన ఓ యువకుడి షార్ట్ ఫిల్మ్స్ మేకర్ గా చలామణి అయ్యాడు. చాలా మంది యువతలకి షార్ట్ ఫిల్మ్స్ లో ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి వారికి తెలియకుండా నగ్న ఫోటోలు, వీడియో తీయడం, వాటి చూపించి బెదిరించి వ్యభిచార కూపంలోకి దింపేవాడు. అలా బిజినెస్ బాగానే జరుగుతుండటంతో రెచ్చిపోయాడు. ఐతే, ఓ మైనర్ బాలిక ధైర్యం చేసి.. పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భయంకరమైన నిజాలు వెలుగులోని వస్తున్నాయి.
మైనర్ బాలిక ఫిర్యాదుతో పోలీసులు స్కెచ్ వేసి మరీ.. నిందితుడి పట్టుకొన్నారు. ఒకే సమయంలో ప్రధాన నిందితుడిని, ఎనిమిది మంది నిర్వాహకులను, ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. కాగా అదే సమయంలో ఏడుగురు బాధిత యువతులకు విముక్తి కల్పించారు. ఈ వ్యభిచార గృహాలు 4 సంవత్సరాలుగా సాగుతుందని, ఈ విషయాలు అన్ని బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. కాగా ఈ వ్యవహారంలో కొందరు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.