గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ ప్రదీప్ !

యాంకర్ ప్రదీప్ అజ్ఝాతంలోకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత నెలరోజులుగా ఆయన బయట కనిపించడం లేదు. టీవీ షోస్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో రకరకాల ప్రచారం జరిగింది. ప్రదీప్ కి యాక్షిడెంట్ అయింది. ఇంట్లో విశ్రాంతి తీసుకొంటున్నారని, కాదు.. మల్లెమాలతో ఆయనకి తేడాలొచ్చాయని, ఇవేమీ కాదు.. ప్రదీప్ పెళ్లి పనుల్లో ఉన్నాడు. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనే ప్రచారం జరిగింది. తాజాగా ప్రదీప్ గుడ్ న్యూస్ చెప్పాడు. అలాగని పెళ్లి న్యూస్ కాదు. 

త్వరలోనే మళ్లీ ముందుకు వస్తానని తెలిపాడు ప్రదీప్. ఇన్నాళ్లు తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. “నాకు ఏమైందా అంటూ బాధపడ్డ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెల రోజులుగా ఇంట్లో రెస్ట్ తీసుకున్నాను. నా కాలికి షూట్ సమయంలో చిన్న ప్రాశ్చర్ అయ్యింది. అయినా కూడా షూట్స్ లో పాల్గొనడం వల్ల కాస్త సీరియస్ అయింది అంతే తప్ప ఇంకేమీ లేదని చెప్పాడు. గత నాలుగైదు వారాలుగా కాళును అలా పైకి పెట్టి టీవీ చూస్తూ కూర్చున్నాను. ఇంకో రెండు వారాల్లో షూట్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలిపారు.