బ్రేకింగ్ : రేపే అయోధ్య కేసు తుది తీర్పు

దశాబ్ధాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మ భూ వివాదంపై రేపు సుప్రీం తుది తీర్పుని వెలువరించనుంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకధాటిగా 40 రోజులుగా విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి ఈ నెల 17 పదవి విరమణ చేసే లోపు గుది తీర్పు వెలువడనుందని ముందు నుంచి చెబుతున్నారు.

తాజాగా తుది తీర్పుకి రేపటి ముహూర్తం ఖరారు చేశారు. రేపు ఉదయం 10:30 నిమిషాలకి సుప్రీం కోర్టు తుది తీర్పుని వెల్లడించనుంది. ఈ  నేపథ్యంలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ యూపీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అయోధ్యతో పాటు ఉత్తరప్రదేశ్ లో శాంతిభద్రతలు, తీర్పు నేపథ్యంలో తీసుకున్న చర్యలపై చీఫ్ జస్టిస్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక కేంద్రం ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో గత వారంరోజుల నుండే దేశంలోని ప్రధాన నగరాలు, సున్నిత ప్రాంతాలలో కేంద్రం బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే.