4 నెలల్లోనే మెగాస్టార్ సినిమా !

మెగాస్టార్ చిరంజీవి స్పీడు పెంచాడు. జెడ్ స్పీడుతో కొరటాల శివ సినిమాని పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే యేడాది జనవరిలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కేవలం 4 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాఌకని సిద్ధం చేసుకొన్నట్టు తెలుస్తోంది. దర్శకుడు కొరటాల మార్క్ తెలిసిందే. ఆయన కట్టే.. కొట్టే.. తెచ్చే రీతిలో షార్ప్ గా సినిమా తీస్తాడు. చిరు152 చిత్రానికి మరింత పకడ్భందీగా ప్లాన్ చేసుకొన్నాడట.

ఈ చిత్రంలో చిరుకి జంటగా త్రిష నటించబోతుంది అనే ప్రచారం జరుగుతోంది. మరో హీరోయిన్ గా ఇషా రెబ్బా అనుకొంటున్నారట. ఇక చిరు152 కథ విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇది కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తో తెరకెక్కనుంది. ఇందులో చిరు దేవాదాయశాక అధికారిగా కనిపించబోటున్నారు. బడా రాజకీయ నాయకులు బండారాన్ని బయటపెడతాని చెబుతున్నారు. మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. సినిమాలో చిరు మాజీ నక్సలైట్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించనున్నారు. ఇందులో రామ్ చరణ్ చిన్న, కీలక పాత్రలో మెరిసే ఛాన్స్ ఉందని టాక్.