మహా రాజీకీయంలో బిగ్ ట్విస్ట్
మహారాష్ట్ర రాజకీయం కొత్త టర్న్ తీసుకొంది. ప్రభుత్వ ఏర్పాటుపై భాజాపా ఆశలు వదులుకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ భాజపాను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఇతర నాయకులు ఆదివారం సాయంత్రం గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్ కు చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. వారికి మా శుభాకాంక్షలు అని పాటిల్ అన్నారు.
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు గానూ భాజపా 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో భాజాపా, శివసేన కూటమిగా పోటీ చేశాయి. ఐతే, ఫలితాల అనంతరం చెరో రెండున్నరేళ్ల చొప్పున సీఎం పీఠం పంచుకోవాలని శివసేన పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. శివ ఎంతకి తగ్గకపోవడంతో.. ప్రభుత్వ ఏర్పాటుపై భాజాపా చేతులెత్తేసింది. దీని వెనెక కమనాథుల వ్యూహాం ఏంటన్నది అర్థకావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.