తెలుగు ‘అసురన్’ ఆయన చేతిలో పెట్టేశారా ?
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘వెంకీమామ’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్, త్రినాథరావు నక్కిన దర్శకులతో వెంకీ సినిమాలు చేయాల్సి ఉంది. ఈ ఇద్దరు వెంకీ కోసం కథలు రెడీ చేశారు. ఐతే, ఈ ఇద్దరి దర్శకుల కథలని రిజెక్ట్ చేసిన వెంకీ.. ‘అసురన్’ రిమేక్ ని తెరపైకి తీసుకొచ్చారు. కోలీవుడ్ లో ధనుష్ హీరోగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన అసురన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విమర్శకుల ప్రశంసలు అందుకొంది.
ఏరికోరి ఎంచుకొన్న ఈ కథని వెంకీ ఏ దర్శకుడి చేతులో పెడతారన్నది ఆసక్తిగా మారింది. ఐతే, ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ హను రాఘవపూడికి అసురన్ రిమేక్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. అందాల రాక్షసి, పడి పడి లేచె మనసు చిత్రాలతో హను తనదైన మార్క్ చూపించారు. ఆయన చిత్రాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అసురన్ రిమేక్ బాధ్యతలని ఆయనకి అప్పగించారని ఇండస్ట్రీ టాక్. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.