మహేష్’ని ఆశీర్వధించిన కమల్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కి కృతజ్ఝతలు తెలిపారు. ఆశీర్వధించారు. ఇటీవలే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తన 65వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తాయి. 

సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా కమల్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు “కమల్ హాసన్ సర్‌కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. చలనచిత్ర రంగానికి మీరు చేసిన సేవలు మరువలేనివి. సినీ రంగంలో 60 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. మీరు నిజమైన స్ఫూర్తి ప్రదాత. మీరు ఈ ఏడాదంతా చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ మహేష్ ట్వీట్ చేశారు. తాజాగా మహేష్ ట్విట్ కి కమల్ రిప్లై ఇచ్చారు.

“ధన్యవాదాలు మహేష్‌గారు. మీరు కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గానే కెరీర్ ప్రారంభించారు. ఇప్పుడు సూపర్‌స్టార్‌గా ఎదిగారు. మీ విషెస్‌ను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నా. మీకు ఎప్పుడూ శుభం కలగాలని కోరుకుంటున్నా” అంటూ రీ ట్విట్ చేశారు. ప్రస్తుతం కమల్ భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్నారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.