తెనాలి రామకృష్ణ అప్పుడే ఫ్రీ బోర్డ్ !
ఇటీవలే రిలీజైన ఆది సాయికుమార్ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ రిలీజైన రెండు వారాలకే అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. బ్లాక్ బస్టర్ హిట్టైన సినిమాలు కూడా నాలుగు వారాల్లోనే ప్రైమ్ లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక సందీప్ కిషన్ తాజా చిత్రం తెనాలి రామకృష్ణ రిలీజ్ కి ముందే ఫ్రీగా చూడొచ్చు. అలాగని అందరికీ కాదు.
కర్నూలు, తెనాలి వాసులకి మాత్రమే ఈ ఫ్రీ ఆఫర్. ఈ సినిమా కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. కాబట్టి కర్నూల్ లో ఈ సినిమాను కొన్ని థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించబోతున్నాడు సందీప్ కిషన్. ఇక తెనాలి రామకృష్ణ అనే టైటిల్ వాడుకున్నాడు కాబట్టి, అటు తెనాలిలో కూడా కొన్ని థియేటర్లలో ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శించబోతున్నారు. ఈ నెల 15న విడుదలకానున్న ఈ సినిమాను ఒక రోజు ముందే, అంటే 14వ తేదీనే ఈ ప్రాంత వాసులు ఉచితంగా చూడొచ్చన్నమాట. మరీ.. ఈ ఫ్రీ పబ్లిసిటీ సందీప్ కిషన్ కి ప్లస్ అవుతుందేమో చూడాలి.