పార్టీలకి వెళితే ఆఫర్లు రాలేదట !
ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ జెడ్ స్పీడుతో స్టార్ హీరోయిన్ గా ఎదగడం వెనక ఏదో సీక్రెట్ ఉందని చెప్పుకొంటుంటారు. ఆమె తరచూ నైట్ పార్టీలకి వెళ్లడం ఓ కారణం అనే ప్రచారం ఉంది. అందుకే ఆమె చాలా వేగంగా నైట్ స్టార్ హీరోయిన్ అయింది. మెగా రికార్డ్ (ఒక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తప్ప మెగా హీరోలందరితోనూ తెరను పంచుకొంది) ని కూడా సొంతం చేసుకొందని చెబుతుంటారు. తాజాగా ఈ ప్రచారంపై రకుల్ స్పందించింది.
‘పార్టీలకు హాజరైనంత మాత్రానా హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు దక్కుతాయనేది అపోహ మాత్రమే’నని రకుల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ బిజీ అయ్యే ప్రయత్నంలో ఉంది రకు. బాలీవుడ్ లో బోలెడన్ని నైట్ పార్టీలకు హాజరవుతోంది. ఐతే, అది అఫర్ల కోసం కాదట. జస్ట్ సరదా అంటోంది రకుల్. ఇక రకుల్ కు రానా దగ్గుపాటితో ఎఫైర్ నడుస్తుందనే ప్రచారం కూడా ఉంది. దీనిపై స్పందించిన రకుల్.. రానా తనకి స్నేహితుడు మాత్రమేనని చెప్పింది.