మహా రాజకీయాలపై షా కామెంట్స్

భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మహారాష్ట్ర రాజకీయాలపై తొలిసారి పెదవి విప్పారు. తమ కూటమి అధికారంలోకి వస్తే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారనే ముందే చెప్పామన్నారు. ఎన్నికల తర్వాతే శివసేన ఈ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చిందని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోయేది లేదని తేల్చి చెప్పారు. 

ఏ పార్టీకి సంఖ్యాబలం ఉంటే ఆ పార్టీ గవర్నర్‌ను సంప్రదించొచ్చు. ఆయన తిరస్కరించరు. కపిల్‌ సిబల్‌ వంటి సీనియర్‌ లాయర్లు ప్రభుత్వ ఏర్పాటుకు తిరస్కరించారనడం చిన్నపిల్లల వాదనను తలపిస్తోందని అమిత్‌ షా అన్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఏ పార్టీకి సంఖ్యాబలం ఉంటే ఆ పార్టీ గవర్నర్‌ను సంప్రదించొచ్చు. ఆయన తిరస్కరించరు అన్నారు.