రవితేజ పెద్ద ‘క్రాక్’గాడు !

మాస్ మహారాజ రవితేజ పెద్ద ‘క్రాక్’గాడు అంటున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న హ్యాట్రిక్ చిత్రానికి టైటిల్ ఫిక్సయింది. ‘క్రాక్’ టైటిల్ ని పెట్టారు. తాజాగా టైటిల్ పోస్టర్ ని కూడా వదిలారు. ఇందులో రవితేజ్ క్రాక్ లుక్ లో కనిపిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా క్రాక్ తెరకెక్కనుంది.

ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. రవితేజకి జంటగా శృతిహాసన్ నటిస్తున్నారు. బలుపు తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రమిది.  థమన్ సంగీతం అందించనున్నారు. లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సమ్మర్ లో రిలీజ్ చేయబోటున్నట్టు టైటిల్ పోస్టర్ లోనే తెలిపారు. ఈ సినిమా తమిళ్ హిట్ ‘తెరి’కి రిమేక్ అనే ప్రచారం జరిగింది. ఐతే, అందులో ఏమాత్రం నిజం లేదని దర్శకుడు స్పష్టతనిచ్చారు. వాస్తవ ఘటనల ఆధారంగా క్రాక్ తెరకెక్కనుందన్నారు.