వైభవంగా అర్చన పెళ్లి వేడుక.. ఫోటోలు చూశారా ?
హీరోయిన్ అర్చన వివాహం గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారు జామున 1:30 నిమిషాలకు అర్చన వివాహం జరిగింది. హెల్త్‌కేర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ ని అర్చన పెళ్లాడింది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు, అర్చన సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.అక్టోబర్ 3వ తేదీన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో అర్చన, జగదీశ్‌ల నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే.
అర్చన మంచి నటి. మంచి డ్యాన్సర్ కూడా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిసి దాదాపు 40 సినిమాల్లో నటించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పాల్గొంది. ఆ సమయంలోనే నటుడు శివబాలాజి మంచి స్నేహితుడు అయ్యారు. శివబాలాజీ దంపతులు అర్చన నిశ్చితార్థ వేడుక, పెళ్లి వేడుకలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అర్చన నటించిన ఆఖరి తెలుగు చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. సప్తరిగి హీరోగా నటించిన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.
ఇక అర్చన పెళ్లి వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో పెళ్లి పీఠల మీదనే పెళ్లి కొడుకు జగదీష్ అర్చనని ముద్దుపెట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అర్చన-జగదీష్ పెళ్లి వేడుక ఫోటోలని మీరు చూసేయండీ.. !