వైరల్ : రామ్ జిమ్ వీడియో

ఎనర్జిటిక్ హీరో మరోసారి జిమ్ వీడియోని షేర్ చేశాడు. ఈ సారి బరువులని మాత్రమే కాదు. తన ట్రైనర్ ని కూర్చోబెట్టుకొని మరీ కసరత్తులు చేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన రామ్ తన తదుపరి సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి ‘రెడ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మలు కథానాయికలు.  తమిళ హిట్ ‘తాడమ్’కు రీమేక్ ఇది. ఈ సినిమా కోసం రామ్ మొదటి సారి ద్విపాత్రాభినయం చేయనున్నారు. రెండు పాత్రల్లోనూ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి సంగీతం మణిశర్మ అందించబోతున్నారు. ఈరోజు నుంచే (నవంబర్ 16) నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. ఈసినిమాను 9ఏప్రిల్ 2020న విడుదల చేయనున్నారు.