‘జార్జ్ రెడ్డి’ పెయిడ్ ప్రీమియర్స్ ఎప్పుడంటే ?

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. సందీప్‌ మాధవ్‌, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో నటించారు. చిన్న సినిమాగా తెరకెక్కిన జార్ రెడ్డి.. ట్రైలర్ రిలీజ్ తర్వాత పెద్ద సినిమాగా రూపాంతరం చెందింది. ఎందుకంటే ? జార్జ్ రెడ్డి ట్రైలర్ ఆ రేంజ్ లో ఆకట్టుకొంది. ప్రేక్షకులు, సినీ ప్రముఖులు జార్జ్ రెడ్డి ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఫిదా అయ్యారు.

అంతేకాదు.. జార్జ్ రెడ్డి దర్శకుడు జీవన్ రెడ్డికి పవన్ నుంచి పిలుపొచ్చింది. జార్జ్ రెడ్డి ప్రమోట్ చేసేందుకు కూడా పవన్ ఓకే చెప్పారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా లేదా ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా పవన్ ని జార్జ్ రెడ్డిని ప్రమోట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జార్జ్ రెడ్డి సినిమాపై చిత్రబృందానికి నమ్మకం పెరిగింది. కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సినిమా రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాదు.. జార్జ్ రెడ్డి ప్రీమియర్ షోస్ కి ప్లాన్ చేశారు.

సాధారణంగా ఎంతో నమ్మకం ఉంటే తప్ప పెద్ద సినిమాలకు సైతం పెయిడ్ ప్రీనియర్స్ వేయరు. అలాంటిది చిన్న చిత్రమైన ‘జార్జ్ రెడ్డి’కి పెయిడ్ ప్రీమియర్స్ వేయడం విశేషం. వచ్చే వారం (నవంబర్ 22) జార్జ్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ఒకరోజు ముందే అంటే.. నవంబర్ 21న జార్జ్ రెడ్డి పెయిడ్ ప్రీమియర్ షోస్ ని వేయనుంది చిత్రబృందం. ఈ సినిమాను మైక్‌ మూవీస్‌ బ్యానర్‌తో కలిసి త్రీ లైన్స్‌, సిల్లీ మాంక్స్‌ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.