బంగ్లా చిత్తు చిత్తుగా
తొలి టెస్టులో బంగ్లాదేశ్ వైఫల్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 150 పరుగులకి కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ బంగ్లా తడపడింది. 60 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. తొలుత ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ ఓపెనర్లను బౌల్డ్ చేయగా.. మహ్మద్ షమి 13, 15వ ఓవర్లలో మొమినుల్ హక్(7), మిథున్(18)లను పెవిలియన్కు చేర్చాడు. ప్రస్తుతం ముష్ఫికర్ రహీమ్(9), మహ్మదుల్లా(6) క్రీజులో ఉన్నారు. భారత పేసర్లు మహ్మద్ షమి రెండు, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.
ఇక తొలి ఇన్నింగ్స్ లో భారత్ 493/6 వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ మయాంకర్ అగర్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఆయనకి తోడుగా పూజారా, రెహానే హాఫ్ సెంచరీలతో ఆకట్టుకొన్నారు. బంగ్లా జట్టు ఇంకా 283 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాకి చిత్తు చిత్తుగా ఓడిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియా విజయం ఖాయం. అంత ఈరోజా ? రేపా ?? అన్నది మాత్రమే తేలాల్సి ఉంది.