బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీస్ సిగ్నల్

బ్యాంకుల విలీన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేయడానికి విలీనానికి తెరలేపుతూ ఆగస్టులో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కి పడిపోనున్నది. పీఎన్‌బీలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)లు విలీనమవుతున్న విషయం తెలిసిందే. దీంతో విలీనంకానున్న బ్యాంకుల శాఖలు, ఉద్యోగులు, ఖాతాదారులు, ఇతర ఆర్థికాంశాలు పీఎన్‌బీకి బదిలీ కానున్నాయి. 

అలాగే ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కానున్న ప్రతిపాదను కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. పీఎన్‌బీలో ఓబీసీ, యూబీఐలు విలీనమైన తర్వాత దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనున్నది. వీటితోపాటు సిండికేట్ బ్యాంక్‌లో కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌లో ఇండియన్ బ్యాంక్ కలిసిపోనున్నాయి.