సురేందర్ రెడ్డిని బలవంతం చేశారా ?
కల్యాణ్ రామ్ ‘అతనొక్కడే’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సురేందర్ రెడ్డి. ఆయన రెండో సినిమానే యంగ్ టైగర్ ఎన్ టీఆర్ తో ‘అశోక్’ చేశాడు. కానీ, అశోక్ అట్టర్ ప్లాప్ అయింది. ఆ తర్వాత అతిథి, కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, ధృవ సినిమాలతో స్టయిలీష్ దర్శకుడు అనిపించుకొన్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకొన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సైరా’ కమర్షియల్ లెక్కలు పక్కన పెడితే.. మంచి సినిమా అనిపించుకొంది.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమా చేసేందుకు సురేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు, పవన్ కల్యాణ్ కి కథని వినిపించేందుకు ప్రయత్నాలు చేశాడు. అవి ఫలించాయి కూడా. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తారక్ సినిమా కోసం తనని బలవంతం చేశారని అన్నారు. అసలు అశోక్ సినిమా చేసే ఆలోచన తనకి లేదు. తారక్ మేనేజర్ సుకుమార్ తనని బలవంతంగానే అశోక్ సినిమా చేసేందుకు ఒప్పించారని చెప్పుకొచ్చారు. ఆ కథ కూడా వారే రాసుకొన్నారు. కేవల దర్శకత్వం మాత్రమే వహించానని చెప్పాడు.
అది అట్టర్ ప్లాప్ అయిందన్నాడు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ తర్వాత సురేందర్ రెడ్డి-తారక్ కలయికలో ఊసరవెల్లి సినిమా వచ్చింది. మంచి సినిమా అనిపించుకొంది. కానీ కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. ఈ సినిమా ఫలితంపై మాత్రం సురేంద రెడ్డి పెద్దగా మాట్లాడలేదు. తారక్ సినిమా కోసం బలవంతంగా తనని ఒప్పించారన్న సురేందర్ రెడ్డి మాటలు నందమూరి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా సురేంద రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.