సరిలేరు టీజర్ లాక్ తీసేది నేడే !

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ లోడింగ్ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవలే ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతి త్వరలోనే సరిలేరు టీజర్ రాబోతుందని అనుకొన్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే సరిలేరు నుంచి మరో అప్ డేట్ వచ్చింది. టీజర్ లాక్ ని తీసేది నేడే. ఈ సాయంత్రం 6:03 నిమిషాలకి టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించబోటున్నామని చిత్రబృందం ట్విట్ చేసింది.

వాస్తవానికి డిసెంబర్ మొదటి వారంలో సరిలేరు నీకెవ్వరు టీజర్ రాబోతుందనే ప్రచారం జరిగింది. కానీ, నవంబర్ 23న దర్శకుడు అనిల్ రావిపూడి బర్త్ డే కానుకగా టీజర్ తీసుకొస్తే బాగుంటుందని చిత్రబృందం భావిస్తుంది. ఈ నెల 21న సరిలేరు టీజర్ ని, 23న స్పెషల్ పోస్టర్ ని వదులుతారని తెలుస్తోంది. దానిపై మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. 

మహర్షి తర్వాత సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రమిది. ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆయనకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తునారు. అనిల్ సుంకర్, దిల్ రాజు, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు అల్లు అర్జున్ అల.. వైకుంఠపురంలో కూడా విడుదల కానుంది.