సమంత డెలవరీ డేటు ఫిక్స్ !
అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ తల్లికాబోతుంది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్. అందుకే సినిమాలు తగ్గించుకుంటోంది అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ గ్యూడ్ న్యూస్ పై సమంత స్పందించింది. అవునూ.. అది నిజమే. 2022 సంవత్సరంలో ఆగస్టు 7న ఉదయం ఏడు గంటలకు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నానని తెలిపింది. ఐతే, సమంత చేసిన సటైరికల్ కామెంట్స్ ఇవి.
సామ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. నెలకోసారైనా వారితో ప్రత్యేకంగా చిట్ చాట్ చేస్తుంటుంది. ఇటీవల కూడా సామ్ సోషల్ మీడియాలో అభిమానులు కాసేపు సరదాగా చాట్ చేసింది. ఈ సందర్భంగా ఆమెను ఓ నెటిజన్.. మీరు ఎప్పుడు తల్లి కాబోతున్నారు ? అంటూ ప్రశ్నించాడు. దానికి సామ్ స్పందిస్తూ.. 2022 సంవత్సరంలో ఆగస్టు 7న ఉదయం ఏడు గంటలకు ఓ బిడ్డకు జన్మనిస్తా అంటూ వ్యంగ్యగా సమాధానం చెప్పింది.
ప్రస్తుతం సామ్ 96 తెలుగు రీమేక్ లో నటిస్తోంది. ఇందులో శర్వానంద్ కు జోడిగా కనిపించనుంది. ఇదీగాక.. ఓ వెబ్ సిరీస్ లో విలన్ గా కూడా నటించబోతున్నట్లు సమాచారమ్. ఇక పెళ్లి తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న సమంత ఖాతాలో ఈ యేడాది రంగస్థలం, మజిలీ హిట్స్ పడ్డాయి. ఇక 96 వచ్చే యేడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.