అమెజాన్ ప్రైమ్ లో ‘సైరా’ చూసేయండీ.. !


మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాని చూడాలని చూడలేకపోయిన వారికి, చూసినా మళ్లీ చూడాలనుకొనే వారికి గుడ్ న్యూస్. సైరా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’. తొలి స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్ తో ప్యాన్ ఇండియా సినిమాగా తీసుకొచ్చారు. మంచి సినిమా అనిపించుకొన్నా.. కమర్షియల్ గా కొన్ని చోట్ల నష్టాలు తప్పలేదు.

సైరా సినిమాని రామ్ చరణ్ కమర్షియల్ యాంగిల్ లో ఎప్పుడూ చూడలేదు. నాన్న, మెగాస్టార్ చిరంజీవికి ఓ మంచి సినిమా అందించాలనే తపనతో భారీగా ఖర్చుపెట్టారు. కాబట్టి.. సైరా నష్టాలపై మెగా ఫ్యామిలీలో అసంతృప్తి ఏమాత్రం లేదు. గాంధీ జయంతి కానుకగా ఆగస్టు 2 న ప్రేక్షకుల ముందుకొచ్చిన సైరా.. రేపటి (నవంబర్ 21) నుంచే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది. దీనిపై అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన చేసింది. తెలుగు, తమిళ, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమ్ కానుంది. దీంతో డిజటల్ మీడియాలో మెగాస్టార్ గర్జించబోతున్నాడని అభిమానులు చెప్పుకొంటున్నారు.