మళ్లీ మెగాస్టార్-మణిశర్మల జోడీ !

ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ మణిశర్మ తళుక్కున మెరిసారు. ఆర్ ఆర్ తో అదరగొట్టేశాడు. ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ మరోసారి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నట్టు సమాచారమ్. ‘సైరా’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరు సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జనవరి నుంచి సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుంది. ముందుకు గా ఈ సినిమా కోసం సైరా కు సంగీతాన్ని అందించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని అనుకొన్నారు. 

కానీ, ఇప్పుడు మణిశర్మని తీసుకొన్నట్టు సమాచారమ్. మెగాస్టార్-మణిశర్మ లది హిట్ కాంబో. బావగారూ బాగున్నారా, అన్నయ్య, చూడాలని వుంది.. ఇంద్ర ఇలా ఎన్ని హిట్ లు ఈ కాంబినేషన్ లో. ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. కొరటాల-చిరు సినిమాకి మణిశర్మ ఫిక్సయ్యారు. బాలయ్య, మహేష్ లతో కూడా మణిశర్మ కాంబినేషన్ ఎన్నో చిత్రాలు చేసింది. కొత్త నీరు వచ్చి మణిశర్మ వెనక్కు తగ్గారు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ మణిశర్మలోని పదను కనిపించింది. ఈ సారి ఆయన అన్నయ్య కోసం అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే పని మొదలెట్టబోతున్నాడట.