పవన్ కల్యాణ్ అరెస్ట్’కు రంగం సిద్ధం ?


జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎందుకు ? దానికి గల కారణాలు ఏంటన్నది మాత్రం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకే తెలియాలి. ఆయన తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ తాజాగా ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ ని విడుదల చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ ని అరెస్ట్ చేస్తే అంటూ మహేష్ కత్తి అనడం ఆశ్చార్యానికి గురి చేసింది.

ఈ సినిమాలో కత్తి మహేష్ ఓ పాత్రలో నటిస్తున్నారు. అదేంటీ ? అన్నది తెలియదు. కానీ, ట్రైలర్ ఆయన గెటప్ ని చూస్తే సీబీఐ ఆఫీసర్ అని తెలుస్తోంది. అసలే పవన్ అంటే అసలు పడని కత్తి మహేష్ తో పవన్ కల్యాణ్ ని అరెస్ట్ చేస్తే.. అంటూ ట్రైలర్ లో ఓ డైలాగ్ పెట్టాడు వర్మ. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. నేరుగా పవన్ ని టచ్ చేయకుండా కత్తి మహేష్ తో పవన్ పడినట్టు కనిపిస్తోంది. రెండో ట్రైలర్ లో షాకింగ్, షేకింగ్ విషయాలు చాలానే ఉన్నాయి. వాటిని మీరు చూసేయండీ.. !