‘జార్జ్ రెడ్డి’ జ్యూక్ బాక్స్.. మీ కోసం !

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, పీడీఎస్ యూ స్థాపకుడు జార్జ్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’.చిన్ని సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత పెద్ద సినిమాగా మారింది. ప్రేక్షకులు, సినీ ప్రముఖులు జార్జ్ రెడ్డి ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. మెగా హీరోల మద్దతు జార్జ్ రెడ్డికి దొరికింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు జార్జ్ రెడ్డిని ప్రమోట్ చేశారు. దీంతో టాలీవుడ్ ని రాబోతున్న మరో సంచలన చిత్రంగా జార్జ్ రెడ్డి ని చెప్పుకొంటున్నారు.

ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. సందీప్ మాధవన్ జార్జ్ రెడ్డిగా కనిపించబోతున్నారు. ఈ వారమే (నవంబర్ 22) న జార్జ్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా జ్యూక్ బ్యాక్స్ ని విడుదల చేశారు. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. దేనికైదే ప్రత్యేకంగా ఉన్నాయి. యూత్ ని ప్రత్యేకంగా ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. జార్జ్ రెడ్డి ఫుల్ సాంగ్స్ ని మీరు ఓసారి వినేయండీ.. !