సైరా హవా మళ్లీ మొదలు


ఈ యేడాది తెలుగు సినిమా సౌండ్ దేశవ్యాప్తంగా గట్టిగానే వినిపించింది. దేశంలో ‘సాహో’ ఫీవర్ చాన్నాళ్లే నడించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ కోసం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూశారు. కానీ, సాహో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సాహో ఫీవర్ తగ్గకుండా మరో తెలుగు సినిమా ‘సైరా’ సందడి మొదలైంది.
 
ఈ రెండు సినిమాలే కాకుండా బాలీవుడ్ లో రిమేక్ అయిన మన అర్జున్ రెడ్డి ‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. డియర్ కామ్రెడ్, మజిలీ, జెర్సీ, ఎఫ్2 సినిమాల గురించి బాలీవుడ్ ప్రేక్షకులు మాట్లాడుకొన్నారు. ఇప్పుఇడీ సినిమాలు బాలీవుడ్ లో రిమేక్ చేసేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయం పక్కనపెడితే.. ఇప్పుడు మరోసారి దేశంలో సైరా హవా మొదలైంది. 

సైరా సినిమా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. సైరా సినిమాని చూడాలనుకొని చూడలేకపోయిన వారికి, చూసినా.. మరోసారి చూడాలనుకొనేవారికి ఇదో మంచి అవకాశం. అమెజాన్ ప్రైమ్ లో సైరా రాబోతుందనే న్యూస్ కూడా వైరల్ గా మారింది. మరీ.. డిజిటల్ మీడియాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గర్జించబోతున్నాడు. ఈ చిత్రానికి సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహించారు. బిగ్ బీ అమితాబ్, నయనతార, కిచ్చసుధీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలో నటించారు.