కేసీఆర్ ది అమరులకంటే గొప్ప త్యాగమా..?
కొలువులకై కొట్లాట సభలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, మేధావులు, విపక్ష నేతలు ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రధాన సమస్య నిరుద్యోగమని, అలాంటి నిరుద్యోగులను కేసీఆర్ పట్టించుకోకపోవడం బాదాకరమని అన్నారు.
కేసీఆర్ నిర్ణయాలను విభేదించినంత మాత్రాన వారిపై ప్రభుత్వ వ్యతిరేకులంటూ ముద్ర వేయడం సమంజసం కాదన్నారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ కొంతమంది తామే తెలంగాణ తెచ్చాము అని చెప్పుకుంటున్నారని, తిరిగి రాని ప్రాణాలనే వదులుకున్న అమరులకంటే కేసీఆర్ ది గొప్ప త్యాగమేమీ కాదని అన్నారు.
ఓయూలో విద్యార్థి మరణానికి కారణం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడమే అని, ఇక్కడికి వచ్చే వారితో పాటు ఆహార పొట్లాల వాహనాలను కూడా పోలీసులు స్టేషన్ లో పెట్టారని, నిర్భందాలతో తమ కొట్లాట ఆగేది కాదని కోదండరాం విమర్శించారు.