వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారా ?

భాజాపా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీలోకి భారీ వలసలు జరగబోతున్నారు. తెదేపాకు చెందిన 20 ఎమ్మెల్యేలు, ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారు. వారితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కూడా తమని సంప్రదిస్తున్నారని ఆయన అన్నారు. ఐతే, వారిని ఇప్పుడే పార్టీలో చేర్చుకోమని చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడే వారిని పార్టీలో చేర్చుకొంటామని తెలిపారు. బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యం అన్నారు సుజనా. 

టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు ఉంటాయన్నది అందరు ఊహించినదే. కానీ, వైసీపీ నుంచి బీజేపీలో వలసలు అనేవి ఊహించనిది. ఎందుకంటే ? ఏపీలో జగన్ ప్రభుత్వం పటిష్టంగా ఉంది. ఏకంగా 151ఎమ్మెల్యేలకి పైగా ఉన్నారు. మరో నాలుగేళ్లు ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదు. ప్రస్తుతం జగన్ దూకుడు చూస్తుంతే.. మరోసారి ఏపీలో ఆయనే వచ్చేలా ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ నేతలు బీజేపీలో చూడటం సప్రైజ్ లాంటిదే. బహుశా.. ఏ కేసులోనో జగన్ కి చెక్ పెట్టేలా భాజాపా ప్లాన్ గీస్తుందేమో.. ఆ తర్వాత గేమ్ ప్లాన్ తో ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.