రివ్యూ : జార్జ్ రెడ్డి

చిత్రం : జార్జ్ రెడ్డి

నటీనటులు : సందీప్‌ మాధవ్‌, సత్య దేవ్, మనోజ్‌ నందన్, చైతన్య కృష్ణ, వినయ్‌ వర్మ, అభయ్‌, ముస్కాన్, మహాతి

సంగీతం : సురేష్‌ బొబ్బిలి

దర్శకత్వం : జీవన్‌ రెడ్డి

నిర్మాత : అప్పిరెడ్డి

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్, 2019

విప్లవవాద విద్యార్ధుల ఉద్యమ స్థాపకుడు, ఉస్మానియా యూనివర్శిటీలో 1965 నుంచి 1975 మ‌ధ్య ఎన్నో ఉద్య‌మాలు న‌డిపిన విద్యార్ధి నాయ‌కుడు జార్జ్ రెడ్డి. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్‌ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శం. ఆయన జీవితకథ ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. జార్జ్ రెడ్డి పాత్రలో సందీప్ మాధవ్ నటించారు. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన జార్జ్ రెడ్డి ఎలా ఉంది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :
జార్జిరెడ్డి (శాండీ)ది చిన్నప్పటి నుంచీ అన్యాయాలను ఎదుర్కొనే స్వభావం. అమ్మ చెప్పే కథలు వింటూ… అందులో ఉన్న నీతిని బుర్రకు ఎక్కించుకుంటుంటాడు. అనేక ప్రశ్నలు వేస్తూ… కొత్త విషయాల్ని కనుక్కోవాలన్న తాపత్రయంతో ఉంటాడు. యుద్ధ విద్య ల్లోనూ ప్రావీణ్యం సంపాదిస్తాడు. చదువంటే పిచ్చి. కేరళ, చెన్నైలో జార్జ్ రెడ్డి విద్యాభ్యాసం సాగింది.

ఉన్నత విద్యకోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేరుతాడు. అక్కడి తప్పుల్ని ప్రశ్నిస్తాడు. విద్యార్థులలో చైతన్యం రగిలిస్తాడు. అక్కడ ఓ నాయ కుడిగా ఎదుగుతాడు. రైతుల సమస్యపై సమర శంఖం మోగిస్తాడు. ఈ చైతన్యాన్ని దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకూ తెలిసేలా చేస్తాడు. అలా… జార్జిరెడ్డి పేరు మార్మోగిపోతుంది. ఉస్మానియా క్యాంపస్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి. శాంతిభద్రతల సమస్య కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో జార్జిరెడ్డిని కొంత మంది పథకం ప్రకారం హత్య చేస్తారు. ఇదంతా జరిగిన కథే. దాన్నే తెరపై చూపించాడు దర్శకుడు.

ప్లస్ పాయింట్స్ :

* కథ

*సందీప్ మాధవ్ నటన

* తల్లి సెంటిమెంట్‌

* సినిమాటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌

* సెకండాఫ్‌

* స్లో నెరేషన్‌

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

జార్జ్ రెడ్డి కథని దర్శకుడు జీవన్ రెడ్డి ఆసక్తికరంగా మొదలెట్టాడు. ఆయన బాల్యం, ఉస్మానియా యూనివర్సిటీలో అప్పటి పరిస్థితులు, అక్కడ జార్జ్ రెడ్డి విద్యార్థినాయకుడిగా ఎదిగిన విధానం అన్నీ కళ్లకి కట్టినట్టు చూపించాడు. ఐతే సినిమా ముందుకు సాగినా కొద్ది సాదాసీదాగా అనిపిస్తుంది. ఇక సెంకఢాఫ్ లో యూనివర్సిటీ ఎన్నికలు, క్లైమ్కాక్స్ జార్జ్ రెడ్డి హత్య ఉత్కంఠగా సాగాయి. ఐతే, సినిమా పడుతూ లేస్తూ సాగినట్టు అనిపించింది.

సందీప్‌ మాధవ్‌ జార్జ్ రెడ్డి పాత్రలో లీనమైపోయాడు.  ఈ సినిమాలోనూ వందకు వంద మార్కులు సాధించాడు. బాడీ లాంగ్వేజ్‌, దుస్తులు, నడవడిక అచ్చం జార్జిరెడ్డిని తలపించేలా చేశాడు. పలుచోట్ల జార్జిరెడ్డే కళ్ల ముందే నిలుచున్నట్లు అనిపిస్తుంది. ఇక తల్లి పాత్రలో మరాఠీ నటి దేవిక జీవించిందనే చెప్పాలి. హీరోయిన్‌ ముస్కాన్‌ తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించింది. ఇక అభయ్‌, యాదమరాజు, పవన్‌, సత్యదేవ్‌, మనోజ్‌ నందం తదితర నటులు తమ పరిధి మేరకు మెప్పించారు. ముఖ్యంగా అభయ్‌, యాదమరాజు తన పెర్ఫార్మెన్స్‌తో హీరోకు పోటీగా నిలవడం విశేషం.

సాంకేతికంగా :

సాంకేతిక నిపుణుల పనితీరు ఆకట్టుకుంది. పాటలు చాలా తక్కువ. ఓ పాట మినహా మిగిలిన రెండూ కథా పరంగా సాగేవే. ఈ సినిమాలో
మరో ప్రధాన అంశం సినిమాటోగ్రఫి. కెమెరా పనితనం బాగుండటంతో ఆ కాలానికి వెళ్లిపోతాం.  కళా దర్శకుడి ప్రతిభ ఆకట్టుకుంటాయి. జార్జిరెడ్డి కథని మరీ.. సినిమాటిక్ స్వేచ్ఛ ని తీసేసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.

రేటింగ్ : 2.75/5