మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న సందిగ్థత తొలగిపోయినట్టు సమాచారమ్. అనేక చర్చల అనంతరం మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమితో ప్రభుత్వ ఏర్పాటు ఖరారైంది. మరికొద్దిసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ముఖ్యమంత్రి పదవి శివసేనకు దక్కేలా మూడు పార్టీలు అంగీకరించాయి.
మొత్తం ఐదేళ్ల కాలం శివసేన నేత పదవిలో ఉండేలా నిర్ణయానికొచ్చినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం తండ్రి ఉద్దవ్ థాక్రే అవుతారా.. ? లేక కొడుకు ఆదిత్య థాక్రే అవుతారా ? అనే చర్చ మొదలైంది.శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏం చర్చించారన్న దానిపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ, సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే లేదా ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రే ఉండాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ కు 12శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఉపముఖ్యమంత్రి పదవి కూడా కాంగ్రెస్ ను వరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.