‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ అదిరిపోయింది !

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. 

‘మీరు ఎవరో మాకు తెలీదు. మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు. కానీ మీ కోసం, మీ పిల్లల కోసం పగలు రాత్రి, ఎండా వానా లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత’ అంటూ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ‘భయపడే వాడే భేరాకొస్తాడు. మన దగ్గర భేరాల్లేవమ్మా’, గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్’, ప్రతి సంక్రాంతికి అల్లులొస్తారు. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు’ అనే డైలాగ్స్ బాగా పేలాయ్. మొత్తానికి యాక్షన్, డైలాగ్స్ హైలైట్ గా సరిలేరు టీజర్ కట్ చేశారు.