ఈసారి మహేష్ లెక్కలు తప్పాయ్ !
సూపర్ స్టార్ మహేష్ బాబు పారితోషికం తీసుకోరు. దానికి బదులుగా నాన్ థియేట్రికల్ హక్కులని తీసుకుంటారు. ఆ రూపంలో మహేష్ ఖాతాలో రూ. 50కోట్ల వరకు వస్తాయట. మహర్షి సినిమాకు అదే జరిగింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాని కూడా ఇదే ఒప్పందంపై చేస్తున్నాడు మహేష్. నాన్ థియేట్రికల్ హక్కులని మహేష్ తీసుకోనున్నాడు. ఐతే, ఈసారి మహేష్ లెక్కలు తప్పినట్టు సమాచారమ్.
ఇప్పటికే హిందీ డబ్బింగు రైట్స్ లో ఆశించినంత రాలేదు.మహేష్ అంచనాకు ఏడెనిమిది కోట్లు తగ్గిందట. ఇతరత్రా రైట్స్ లోనూ అంత బేరం పలకలేదని తెలుస్తోంది. దీంతో మహేష్ కి దక్కుతుందనుకున్న 50కోట్ల ప్యాకేజ్ అందకుండా పోతోందట. ఎంత తగ్గుతుంది? అన్నది సరిగ్గా చెప్పట్లేదు. కానీ 10, 20 వరకు తగ్గొచ్చని చెబుతున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే విడుదలైన సరిలేరు టీజర్ అదిరిపోయింది. సినిమాపై అంచనాలు ఆశాకాన్నంటేలా ఉన్నాయి.