క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది !


మహారాష్ట్రలో రాజకీయాల్లో క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖరారైంది. మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అనుకొన్నారంతా. శుక్రవారం సాయంత్రం వరకు అలాగే అనిపించింది. కానీ రాత్రికి రాత్రే మహా రాజకీయాలని అనూహ్య మలుపు తిప్పింది భాజాపా అధిష్టానం. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగుమం చేసుకొంది. తెల్లవారగానే గవర్నర్ కలవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయ్.

ఈ మొత్తం ఏపీసోడ్ లో ఎన్సీపీ శివసేన కి వెన్నుపోటు పొడిచిందని.. దేశంలోనే ఇది మహా వెన్నుపోటు అని చెప్పుకొంటున్నారు. అసలు వెన్నుపోటు పడింది శరద్ పవార్ కు. ఆ పార్టీ నేత అజిత్ పవార్, మరికొందరు ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఈ విషయం పవార్ కి కూడా తెలిదట. ఒక్క ప్రభుత్వా ఏర్పాటు విషయంలోనే అజిత్ పవార్ శరద్ పవార్ తో విబేధించారా ? లేక మొత్తం పార్టీనే లాగేసుకొన్నారా ?? అన్నది తెలియాల్సి ఉంది. దానికి ఫలితంగా ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవికి దక్కింది.