మహా రాజకీయాలపై హారీష్ కామెంట్
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయ్. క్లైమాక్స్ పూర్తయిన సరికొత్త ట్విస్టులు వచ్చిపడుతున్నాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెన్నుపోటుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్, మరికొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీకి సపోర్ట్ చేశారు. దాంతో.. గవర్నర్ ఇచ్చిన వారంరోజుల గడువులో భాజాపా బలం నిరూపించుకొంది. వారికి 170మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనే వార్తలొచ్చాయ్.
ఇంతలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు ఎన్సీపీ అధినేత. అసలు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎవరు భాజాపాకి సపోర్ట్ చేయడం లేదన్నారు. అప్పటివరకు అజిత్ పవార్ తో కలిసి దేవదేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనబడిన ఎమ్మెల్యేలు సైతం యూటర్న్ తీసుకొన్నారు. తమకి ఏ పాపం తెలియదు. తాము శరద్ పవార్ వైపే ఉన్నామని ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో అజిత్ పవార్ వెన్నుపోటే హైలైట్ గా నిలిచింది.
ఐతే, మహారాజకీయాల్లో ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు కొత్తేమీ కాదు. గతంలో శరద్ పవార్ చేసిందే. ఈ విషయాన్ని గుర్తు చేశారు టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్. “పవార్ 1978లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. మర్నాడే పార్టీని చీల్చి ప్రొగ్రెసివ్ ఫ్రంట్ నెలకొల్పి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా ఇప్పుడు ఆయనకే ఆ పాఠం ఎదురవడం విశేషం. అజిత్ పవార్ వెంట 30 మంది ఎన్సీపీ శాసనసభ్యులు ఉన్నట్టు సమాచారం” అంటూ హరీష్ ట్విట్ చేశారు. హరీష్ కు సినిమాలపైనే కాదు. రాజకీయాలపి మాంఛి పట్టున్నట్టుంది.
Karma …..
పవార్ 1978లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. మర్నాడే పార్టీని చీల్చి ప్రొగ్రెసివ్ ఫ్రంట్ నెలకొల్పి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా ఇప్పుడు ఆయనకే ఆ పాఠం ఎదురవడం విశేషం. అజిత్ పవార్ వెంట 30 మంది ఎన్సీపీ శాసనసభ్యులు ఉన్నట్టు సమాచారం.
— Harish Shankar .S (@harish2you) November 23, 2019